వట్టెం పంప్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌ ఘటనపై రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వండి : మంత్రి జూపల్లి కృష్ణారావు

వట్టెం పంప్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌ ఘటనపై రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వండి : మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌, వెలుగు : పాల‌‌‌‌‌‌‌‌మూరు–రంగారెడ్డి ఎత్తిపోత‌‌‌‌‌‌‌‌ల ప‌‌‌‌‌‌‌‌థ‌‌‌‌‌‌‌‌కంలోని వట్టెం పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ ముంపు ఘటనపై రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆఫీసర్లను ఆదేశించారు. పునరుద్ధరణ పనులను త్వరగా చేపట్టాలని సూచించారు. నీట మునిగిన పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ను బుధవారం నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే రాజేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ మునిగిపోవడానికి కారణాలు, మోటార్ల కెపాసిటీ, సర్వీస్, నిర్వహణ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. 

ఆడిట్‌‌‌‌‌‌‌‌ టన్నెల్‌‌‌‌‌‌‌‌ ద్వారా సొరంగంలోకి వస్తున్న వరదకు అడ్డుకట్ట వేశామని ఆఫీసర్లు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రవాహం పూర్తిగా ఆగిన వెంటనే టన్నెళ్ల వద్ద మోటార్లు ఏర్పాటు చేసి సొరంగ మార్గంలో నిలిచిన నీటిని బయటకు పంపింగ్‌‌‌‌‌‌‌‌ చేయాలని సూచించారు. అంతకుముందు ఏదుల రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ను సందర్శించారు. వారి వెంట ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, చీస్‌‌‌‌‌‌‌‌ క్యూసెక్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ వెంకటకృష్ణ, లిఫ్ట్ అడ్వైజర్‌‌‌‌‌‌‌‌ పెంటారెడ్డి, ఎస్ఈలు లక్ష్మీకాంతరెడ్డి, సత్యనారాయణరెడ్డి, డీఈ సత్యనారాయణగౌడ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.