IPL 2025: ఏం కొట్టుడు కొడుతున్నారు భయ్యా: రికార్డు సృష్టించిన ఐపీఎల్‌-2025 సీజన్‌

IPL 2025: ఏం కొట్టుడు కొడుతున్నారు భయ్యా: రికార్డు సృష్టించిన ఐపీఎల్‌-2025 సీజన్‌

ఐపీఎల్‎లో ఆటగాళ్లు, జట్లు రికార్డులు సృష్టించడం కామన్. కానీ ఐపీఎల్ 2025 సీజన్ మాత్రం వేరే. ఎందుకంటే ఈ సీజనే ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. అదేంటంటే.. ఒకే సీజన్‎లో అత్యధికసార్లు 200కుపైగా స్కోర్లు న‌మోదు కావడం. ఈ సీజన్‎లో ఇప్పటి వరకు 44 సార్లు 200 పరుగుల స్కోర్లు నమోదయ్యాయి. ఒకే సీజన్లో ఇన్నిసార్లు 200 రన్స్ స్కోర్లు నమోదు కావడం 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్. గతంలో ఏ సీజన్‎లోనూ ఇలా జరగలేదు. ఈ సీజన్‎లో ఇంకా 8 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ప్రస్తుతం జట్ల ఫామ్ చూస్తుంటే మరికొన్ని 200 ప్లస్ స్కోర్లు నమోదు కావడం పెద్దకష్టమేమి కాదు. 

ఇక, జట్ల పరంగా చూస్తే.. పంజాబ్, గుజరాత్ టీములు ఈ సీజన్లో ఇప్పటి వరకు ఏడుసార్లు 200 రన్స్‌ చేశాయి. ఈ రెండు జట్లు ఫ్లే ఆఫ్స్‎కు చేరుకున్నాయి. కాబట్టి.. మరికొన్ని డబుల్ సెంచరీ మార్క్  దాటే ఛాన్స్ ఉంది. లక్నో, రాజస్థాన్‌ జట్లు ఇప్పటి వరకు ఆరు సార్లు 200 స్కోర్స్ చేశాయి. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్  నుంచి నిష్క్రమించగా.. లక్నో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. రాజస్థాన్ అన్ని లీగ్ మ్యాచులు ఆడేసింది. 

కాగా, 2025, మార్చి 22న ప్రారంభమైన ఐపీఎల్ 18 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్లో మరో 8 మ్యాచులు మాత్రమే మిగిలున్నాయి. 2025 జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వాస్తవానికి మే నెలలోనే ఐపీఎల్ అయిపోవాల్సి ఉంది. కానీ పాక్, భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో 15 రోజుల పాటు ఐపీఎల్‎ను నిరవధిక వాయిదా వేసింది బీసీసీఐ. మళ్లీ షెడ్యూల్ సవరించడంతో ఐపీఎల్ ముగింపు ఆలస్యమైంది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ముంబై ఇండియన్స్ జట్లు ఫ్లై ఆఫ్స్‎కు చేరుకున్నాయి.