నాగర్ కర్నూల్ జిల్లాలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు

 నాగర్ కర్నూల్ జిల్లాలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు

 

 టీయూడబ్ల్యూజే  మహాసభలో మంత్రి జూపల్లి కృష్ణారావు
 
 నాగర్​ కర్నూల్, వెలుగు: ​జిల్లాలోని జర్నలిస్టుల ఇండ్ల సమస్యలు, అక్రిడిటేషన్, హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన టీయూడబ్ల్యూజే, ఐజేయూ జిల్లా శాఖ నాలుగో మహాసభకు మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనియన్​ జిల్లా అధ్యక్షుడు గోలి సుదర్శన్​రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ  ప్రోగ్రాంకు నాగర్​ కర్నూల్, కల్వకుర్తి ఎమ్మెల్యేలు డా. రాజేశ్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విరహత్​ అలీ, కార్యదర్శి గుండ్రాతి మధు, జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల జర్నలిస్టులు పాల్గొన్నారు. 
 
మంత్రి జూపల్లి మాట్లాడుతూ..  జర్నలిస్టుల హెల్త్​ కార్డులు, ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్​కార్డులు, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.  టీయూడబ్ల్యూజే, ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్​అలీ మాట్లాడుతూ..  జర్నలిస్టులకు హెల్త్​ కార్డులు, ఇండ్ల స్థలాలు, పక్కా గృహాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని  కోరారు. ప్రింట్​మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా  విజయ్​కుమార్​ గౌడ్, సురేశ్, ఎలక్ట్రానిక్​ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా వెంకటస్వామి, ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఎన్నుకున్నారు.