
- ఇయ్యాల ఈగలపెంట వద్ద టూరిజం పనులకు
- మంత్రి జూపల్లి శంకుస్థాపన
నాగర్కర్నూల్, వెలుగు: నల్లమలలోని పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. కొల్లాపూర్సెగ్మెంట్ పరిధిలో నల్లమల ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా అమరగిరి ఐలాండ్, సోమశిల వెల్‌నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ డెవలప్ మెంట్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
‘ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్/యూనియన్ టెరిటరిస్ ఫర్ క్యాపిటల్‌ఇన్వెస్ట్ మెంట్(సాస్కి)’ స్కీమ్ కింద వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. అనంతరం అచ్చంపేట మండలం ఈగలపెంట వద్ద చెంచు మ్యూజియం, అరైవల్ జోన్, రివర్ క్రూజ్ నోడ్, పెంట్లవెల్లి,కోడేరు మండలాల్లో రోడ్లు తదితర పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.