నంది అవార్డులపై కీలక ప్రకటన చేసిన మంత్రి కోమటిరెడ్డి

నంది అవార్డులపై కీలక ప్రకటన చేసిన మంత్రి కోమటిరెడ్డి

నంది అవార్డులపై తెలంగాణ సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2024 ఉగాది నుండి నంది అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని ఆయన అన్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు మురళి మోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థావన పురస్కరించుకొని..  హైదరాబాద్ దసపల్లా హూటల్లో వీబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. 2024 ఉగాది నుండి ప్రతిష్టాత్మకమైన నంది అవార్డులను అధికారికంగా ఇచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సినీ పరిశ్రమను సత్కరించుకోవడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అవార్డుల వల్ల కళాకారుల్లో కొత్త ఉత్సాహం నింపినట్లు అవుతుంది. పార్టీలు, ప్రాంతాలు అనే భేదం లేకుండా.. అర్హులైన కళాకారులకు అవార్డులు అందిస్తాం. ఈ విషయం గురించి ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డితో  చర్చలు కూడా జరిగాయి. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు.. మంత్రి కోమటిరెడ్డి.

ఇక ఇదే కార్యక్రమంలో నటుడు మురళీమోహన్ కు.. నటసింహ చక్రవర్తి.. అనే బిరుదును ప్రధానం చేస్తూ సత్కరించారు కోమటిరెడ్డి. అనంతరం మురళి మోహన్ మాట్లాడుతూ.. నంది అవార్డుల ప్రధానంపై మంత్రి చేసిన వ్యాఖ్యలకు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నంది అవార్డులపై ప్రకటన చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రతి కళాకారుడికి ఇచ్చే గొప్ప గౌరవం.. అంటూ చెప్పుకొచ్చారు మురళీ మోహన్.