లిక్కర్ కేసుకు.. తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం:మంత్రి వెంకట్ రెడ్డి

లిక్కర్ కేసుకు.. తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం:మంత్రి వెంకట్ రెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు కావడంతో తెలంగాణలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈక్రమంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ.. కవిత అరెస్టు, లోక్ సభ ఎన్నికల్లో ఎక్కవ సీట్లు గెలిచేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామా అన్నారు. ఈడీ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీ తీసుకెళ్తే.. రాష్ట్రంలో నిరసనలు చేయడమంటని.. ఢిల్లీలో ధర్నా, నిరసనలు చేసుకోండని బీఆర్ఎస్ నాయకులకు చురకలు అంటించారు. 

అసలు, లిక్కర్ స్కామ్ కు.. తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని మండిపడ్డారు. ఏపీలో చంద్రబాబు అరెస్టు చేస్తే.. హైదరాబాద్ లో ఎందుకు నిరసనలు చేస్తున్నారన్న బీఆర్ఎస్ నాయకులు.. కవితను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకుపోతే తెలంగాణలో ఎందుకు నిరసన చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.

కాగా, లిక్కర్ కేసులో..  మార్చి 15 తేదీ శుక్రవాం మధ్యాహ్నం హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆమెను అరెస్టు చేశారు ఈడీ అధికారులు. భారీ భద్రత నడుమ కవితను ఢీల్లీలోని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు అధికారులు. 
ఈరోజు ఉదయం కవితకు ఈడీ కార్యాలయంలో వైద్య పరీక్షలు చేసి.. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో జడ్జీ ముందు హాజరుపర్చారు ఈడీ అధికారులు.