 
                                    నల్గొండ అర్బన్, వెలుగు: మొంథా తుఫాన్‌తో 334 లోకేషన్స్ లో 230 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యతో కలిసి మంత్రి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ సమయంలో ఆర్అండ్ బీ అధికారులను అప్రమత్తం చేశామన్నారు.
దెబ్బతిన్న రోడ్లు, కోతకు గురైన రోడ్లు, బ్రిడ్జిలు కాజ్‌వేల తాత్కాలిక పునరుద్ధరణకు రూ. 7 కోట్లు, రూ. 225 కోట్లు శాశ్వత పనులకు ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించనట్లు చెప్పారు. తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా సీఎం రేవంత్ రెడ్డి, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ చూపాలని కోరారు.

 
         
                     
                     
                    