ప్రతీ గడపకు సంక్షేమం అందుతోంది

ప్రతీ గడపకు సంక్షేమం అందుతోంది

గతంలో ఒక మునిసిపాలిటీ ఒక కోటి రూపాయలు వస్తే గొప్ప.. ఇప్పుడు వందల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. బాడంగ్ పెట్ మునిసిపల్ కార్పొరేషన్ సభలో మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్..మాట్లాడారు. నాలల అభివృద్ధి కోసం రూ. 100కోట్లు మహేశ్వరం నియోజకవర్గంలో ఖర్చు చేస్తున్నామన్నారు. అనేక ప్రాంతాల్లో వెజ్..  నాన్ వెజ్ మార్కెట్ లు నిర్మాణం చేస్తున్నామన్నారు. రూ. 371 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి పనులు ప్రాంభించుకున్నామన్నారు. పెన్షన్లు పెంచుకున్నాము... ఎక్కువమందికి ఇస్తున్నామన్నారు. మిషన్ భగీరథతో అందరికి తాగు నీటిని అందిస్తున్నామన్నారు. ప్రతి గడపకు సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చదువు కోసం... పెళ్లి కోసం... తరువాత కేసీఆర్ కిట్ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు ఇతర రాష్ట్రాల ప్రభుత్వలు.. కేంద్రం అమలు చేస్తోందన్నారు కేటీఆర్. రిజర్వ్ బ్యాంకు చెప్పిన లెక్కల ప్రకారం దేశానికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. కేంద్రం నుండి మాత్రం సరైన సహకారం లేదన్నారు. హైదరాబాద్ వరదల నష్టంలో కేంద్రం సహకరించలేదన్నారు. అనేక సందర్భాల్లో కేంద్రం రాష్ట్రంపై  వివక్ష చూపుతుందన్నారు. 

ఇవి కూడా చదవండి: 

ఆహారం కోసం వచ్చి అవస్థలు

మేడారం జాతరకు ఎలాంటి అడ్డంకులు లేవు