ఆహారం కోసం వచ్చి అవస్థలు

ఆహారం కోసం వచ్చి అవస్థలు

అడవి నుంచి వచ్చిన ఏనుగులు నీటి కోసం వెళ్లి బురద కుంటలో ఇరుక్కుపోయాయి. బయటకు వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించాయి. ఎంతకు సాధ్యం కాకపోవడంతో గజ రాజులు పెద్దగా అరవడం ప్రారంభించాయి. వీటి అరుపులు విన్న స్థానికులు చెరువు వద్దకు వచ్చి చూసి అధికారులకు సమాచారం అందించారు. జేసీబీల సాయంతో బురదలో చిక్కుకున్న ఆరు ఏనుగులను రక్షించారు. అసోంలోని గోల్ పరా జిల్లాలోని హేఘాలయన్ సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు ఆహారం కోసం బయటకు వచ్చాయి. స్నానం చేసేందుకు దాదాపు 10 ఏనుగులు అందులోకి దిగాయి. వాటిలో నాలుగు ఏనుగులు బయటకు వచ్చాయి. మిగతావి అందులో చిక్కుకున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. ఏనుగులు సురక్షితంగా బయటకు రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అక్కడి నుంచి అవి నేరుగా అడవిలోకి వెళ్లిపోయాయి. 

మరిన్ని వార్తల కోసం 

కోవిడ్ రూల్స్ పాటిస్తూ తరగతులు

పార్లమెంట్ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి