పార్లమెంట్ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి

పార్లమెంట్ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ సమావేశాలు నిర్వహించేందుకు పార్లమెంట్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా.. పార్లమెంట్ సమావేశాలలో మొదటి రెండ్రోజులు జీరో అవర్, క్వశ్చన్ అవర్‎ను రద్దు చేశారు. ఫిబ్రవరి 2నుంచి జీరో అవర్ ఉంటుందని పార్లమెంట్ అధికారులు తెలిపారు. జనవరి 31న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-2023కి సంబంధించిన బడ్జెట్‎ను ప్రవేశపెడతారు. కరోనా కారణంగా పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈసారి బడ్జెట్ ను రెండు విడతలుగా ప్రవేశపెట్టనున్నారు. మొదటి విడత జవనరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో విడత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించనున్నారు.

జీరో అవర్

ప్రజల అత్యవసర సమస్యలను లేవనెత్తేందుకు పార్లమెంట్ సభ్యులకు కల్పించే సమయాన్ని జీరో అవర్ అంటారు. జీరో అవర్‌లో అంశాలను లేవనెత్తడం కోసం, సభ జరిగే రోజున ఉదయం 10 గంటలలోపు స్పీకర్ మరియు చైర్మన్‌కు సదరు ఎంపీలు నోటీసు ఇవ్వాలి. వారు సభలో లేవనెత్తాలనుకుంటున్న విషయాన్ని నోటీసులో తప్పనిసరిగా పేర్కొనాలి. అయితే సభ్యులు జీరో అవర్ లో సమస్యను లేవనెత్తడానికి లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ ఛైర్మన్ అనుమతి ఇవ్వొచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. జీరో అవర్‌లో సభ్యులు నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు, జాతీయ ఆందోళనలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తుతారు.

క్వశ్చన్ అవర్

పార్లమెంటు సమావేశాలలో ప్రశ్నోత్తరాల సమయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ అవర్ లో సభ్యులు సంబంధిత మంత్రులను ప్రశ్నలు అడగడానికి వీలుంటుంది. ప్రశ్నోత్తరాల సమయంలో అడిగే ప్రశ్నలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. నక్షత్రం గుర్తు ఉన్నవి, నక్షత్రం లేనివి, ప్రైవేట్ సభ్యులకు సంబోధించే ప్రశ్నలు మరియు షార్ట్ నోటీసు ప్రశ్నలు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీలు అడిగే ప్రశ్నల కోసం కొన్ని మార్గదర్శకాలు కూడా ఉంటాయి. సభ్యులు అడిగే ప్రశ్నలు 150 పదాలకు మించకూడదు.

For More News..

ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు రీఓపెన్!

తల్లి బర్త్ డే సందర్భంగా చిరు భావోద్వేగ పోస్ట్

కొత్త డ్యాన్స్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన తమన్నా