మేడారం జాతరకు ఎలాంటి అడ్డంకులు లేవు

V6 Velugu Posted on Jan 29, 2022

కోవిడ్ కారణంగా మేడారం జాతర జరుగుతుందో లేదో అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మేడారం జాతరపై క్లారిటీ ఇచ్చారు మంత్రి సత్యవతి రాథోడ్. కోవిడ్ కారణంగా మహాజాతర జరుగుతుందో లేదో అన్న అపోహలు భక్తుల్లో ఉన్నాయన్నారు. కరోనా నేపథ్యంలో శానిటేషన్ పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో ప్రణాళికలు నిర్వహించామన్నారు. మహాజాతర నిర్వహించడానికి ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే మహాజాతర ఘట్టంలో కోటిన్నర భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని అంచనా వేస్తున్నామన్నారు. ఈనెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారంలో మొక్కులు చెల్లించుకుంటారని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి: 

ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు రీఓపెన్!

కోవిడ్ రూల్స్ పాటిస్తూ తరగతులు

 

 

Tagged Minister satyavathi rathod, Medaram Jatara, Medaram jatara, Telangana Maha Jatara

Latest Videos

Subscribe Now

More News