హెచ్ఐసీసీలో టై గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించిన కేటీఆర్

హెచ్ఐసీసీలో టై గ్లోబల్ సమ్మిట్  ను ప్రారంభించిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం ఎనిమిదిన్నరేళ్లలో ఎన్నో అద్భుతాలు సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రైవేట్ రాకెట్ స్పేస్‭లోకి పంపిన అంకురం స్కై రూట్ టీ హబ్‭కి చెందినదే అని చెప్పారు. హైటెక్ సిటీ హెచ్ఐసీసీలో టై గ్లోబల్ సమ్మిట్‭ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఆయన.. యువ, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ గమ్యస్థానం అని చెప్పారు. తెలంగాణలో 50 విభాగాల్లో 6500 అంకురాలు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఇప్పటికే... ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద అడోబ్ క్యాంపస్ కోసం హైదరాబాద్‭ను ఎంచుకున్నారని.. అందును తాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని కేటీఆర్ అన్నారు. 

హైటెక్ సిటీ హెచ్ఐసీసీలో మూడు రోజుల పాటు ఈ టై గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సుకు అడోబ్‌ సిస్టమ్స్‌ సీఈవో శంతను నారాయెన్‌, గ్రీన్‌కో గ్రూపు ఎండీ, సీఈవో అనిల్‌ కుమార్‌లతోపాటు 2,500 మంది డెలిగేట్స్‌, 550కి పైగా టై చార్టర్‌ సభ్యులు హాజరయ్యారు. వీరితోపాటు 17 దేశాలకు చెందిన 150 అంతర్జాతీయ స్పీకర్లు, 200కి పైగా పెట్టుబడిదారులు కూడా పాల్గొన్నారు. ఏడోసారి జరుగుతున్న ఈ గ్లోబల్‌ సమ్మిట్‌లో ప్రపంచ వ్యవస్థాపక అభివృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నారు.