బడ్జెట్​లో తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి సహకరించండి : కేటీఆర్

బడ్జెట్​లో తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి సహకరించండి : కేటీఆర్

హైదరాబాద్‌, వెలుగు: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఇండస్ట్రియల్‌ క్లస్టర్లు, నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ను మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు శనివారం కేంద్ర మంత్రికి ఆయన లేఖ రాశారు. గత ఎనిమిదేండ్లుగా తెలంగాణ కోరినా కేంద్ర బడ్జెట్‌లో చెప్పుకోదగ్గ కేటాయింపులేమీ చేయలేదని విమర్శించారు. తెలంగాణకు ప్రధాని ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునేందుకు టైం వచ్చిందని, నిబద్ధతను చాటుకోవడానికి రాబోయే బడ్జెట్‌ ఉత్తమ సందర్భమని కేటీఆర్​ పేర్కొన్నారు. జహీరాబాద్‌లో రూ.9,500 కోట్లతో నిమ్జ్‌ ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో కనీసం రూ.500 కోట్లు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించాలని కోరారు.
 హైదరాబాద్‌ – వరంగల్​, హైదరాబాద్‌ – నాగ్‌పూర్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్లకు అవసరమైన నిధులు ఇవ్వాలని, హైదరాబాద్‌ ఫార్మాసిటీ, జహీరాబాద్‌ నిమ్జ్‌ను కలిపే నోడ్స్‌కు రూ.5 వేల కోట్లు ఖర్చవుతాయని, అందులో 50 శాతం నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి సీతారామన్​కు  కేటీఆర్​ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ – విజయవాడ ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు నిధులు ఇవ్వాలని, ఈ కారిడార్‌లో భాగంగా హుజూరాబాద్‌, జడ్చర్ల, గద్వాల్‌, కొత్తకోట నోడ్స్‌ల అభివృద్ధికి రూ. 5 వేల కోట్లు ఖర్చవుతాయని, ఇందులో రూ.1,500 కోట్లు ఇవ్వాలని కోరారు. టైస్‌ స్కీంలో భాగంగా జడ్చర్లలో కామన్‌ ఎఫ్లూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు అవసరమైన గ్యాస్‌ కేటాయించాలన్నారు. బ్రౌన్‌ ఫీల్డ్‌ క్లస్టర్లు మంజూరు చేయాలని, ఆదిలాబాద్‌ సీసీఐ యూనిట్‌ను మళ్లీ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. 

హ్యాండ్లూమ్​ ఇన్​స్టిట్యూట్​ ఏర్పాటు చేయాలి 

హైదరాబాద్‌లో నేషనల్​ డిజైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని, ఫార్మా సిటీకి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ను కేటీఆర్​ కోరారు.  కేంద్రం ఏర్పాటు చేయబోయే డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ కారిడార్లలో హైదరాబాద్‌ను చేర్చాలని పేర్కొన్నారు. వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు కనీసం రూ.500 కోట్లు ఇవ్వొచ్చని, ఇందులో ఈ బడ్జెట్‌లో రూ.300 కోట్లైనా కేటాయించాలన్నారు. ఇంటిగ్రేటెడ్‌ పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ స్కీంలో భాగంగా టెక్స్‌టైల్‌ పార్క్‌, వీవింగ్‌పార్క్‌, అపెరల్‌ పార్క్‌లతో కూడిన మెగా క్లస్టర్‌ సిరిసిల్లకు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ఆయన కోరారు. పవర్‌ లూమ్‌ల అప్‌గ్రెడేషన్‌ చేయాలని, బ్లాక్‌ లెవల్‌ హ్యాండ్లూమ్‌ క్లస్టర్లు మంజూరు చేయాలన్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని, జీఎస్టీ నుంచి చేనేత రంగాన్ని మినహాయించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో నేషనల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌  పెట్టాలని, ఐటీ అభివృద్ధి కోసం ఐటీఐఆర్‌ మంజూరు చేసే అంశాన్ని మళ్లీ పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. రీ ఆర్గనైజేషన్‌ యాక్ట్‌ ప్రకారం ఖమ్మంలో సెయిల్‌ ద్వారా ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటునందించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​కు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్​ కోరారు. 

హైదరాబాద్‌‌‌‌ – వరంగల్​, హైదరాబాద్‌‌‌‌ – నాగ్‌‌‌‌పూర్‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌ కారిడార్లకు అవసరమైన నిధులు ఇవ్వాలని, హైదరాబాద్‌‌‌‌ ఫార్మాసిటీ, జహీరాబాద్‌‌‌‌ నిమ్జ్‌‌‌‌ను కలిపే నోడ్స్‌‌‌‌కు రూ.5 వేల కోట్లు ఖర్చవుతాయని, అందులో 50 శాతం నిధులు కేటాయించాలని సీతారామన్​కు  కేటీఆర్​ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌‌‌‌  – విజయవాడ ఇండస్ట్రియల్‌‌‌‌ కారిడార్‌‌‌‌కు నిధులు ఇవ్వాలని, ఈ కారిడార్‌‌‌‌లో భాగంగా హుజూరాబాద్‌‌‌‌, జడ్చర్ల, గద్వాల్‌‌‌‌, కొత్తకోట నోడ్స్‌‌‌‌ల అభివృద్ధికి రూ. 5 వేల కోట్లు ఖర్చవుతాయని, ఇందులో రూ.1,500 కోట్లు ఇవ్వాలని కోరారు. టైస్‌‌‌‌ స్కీంలో భాగంగా జడ్చర్లలో కామన్‌‌‌‌ ఎఫ్లూయెంట్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌కు అవసరమైన గ్యాస్‌‌‌‌ కేటాయించాలన్నారు. బ్రౌన్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌ క్లస్టర్లు మంజూరు చేయాలని, ఆదిలాబాద్‌‌‌‌ సీసీఐ యూనిట్‌‌‌‌ను మళ్లీ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. 

హ్యాండ్లూమ్​ ఇన్​స్టిట్యూట్​ ఏర్పాటు చేయాలి 

హైదరాబాద్‌‌‌‌లో నేషనల్​ డిజైన్‌‌‌‌ సెంటర్‌‌‌‌ ఏర్పాటు చేయాలని, ఫార్మా సిటీకి నిధులు కేటాయించాలని సీతారామన్​ను కేటీఆర్​ కోరారు. కేంద్రం ఏర్పాటు చేయబోయే డిఫెన్స్‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌ కారిడార్లలో హైదరాబాద్‌‌‌‌ను చేర్చాలని పేర్కొన్నారు. వరంగల్‌‌‌‌ కాకతీయ మెగా టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ పార్క్‌‌‌‌కు కనీసం రూ.500 కోట్లు ఇవ్వొచ్చని, ఇందులో ఈ బడ్జెట్‌‌‌‌లో రూ.300 కోట్లైనా కేటాయించాలన్నారు. ఇంటిగ్రేటెడ్‌‌‌‌ పవర్‌‌‌‌ లూమ్‌‌‌‌ క్లస్టర్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ స్కీంలో భాగంగా టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ పార్క్‌‌‌‌, వీవింగ్‌‌‌‌పార్క్‌‌‌‌, అపెరల్‌‌‌‌ పార్క్‌‌‌‌లతో కూడిన మెగా క్లస్టర్‌‌‌‌ సిరిసిల్లకు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ఆయన కోరారు. పవర్‌‌‌‌ లూమ్‌‌‌‌ల అప్‌‌‌‌గ్రెడేషన్‌‌‌‌ చేయాలని, బ్లాక్‌‌‌‌ లెవల్‌‌‌‌ హ్యాండ్లూమ్‌‌‌‌ క్లస్టర్లు మంజూరు చేయాలన్నారు. ఇండియన్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ హ్యాండ్లూమ్‌‌‌‌ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని, జీఎస్టీ నుంచి చేనేత రంగాన్ని మినహాయించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌‌‌‌లో నేషనల్‌‌‌‌ ఏవియేషన్‌‌‌‌ యూనివర్సిటీ క్యాంపస్‌‌‌‌  పెట్టాలని, ఐటీ అభివృద్ధి కోసం ఐటీఐఆర్‌‌‌‌ మంజూరు చేసే అంశాన్ని మళ్లీ పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. రీ ఆర్గనైజేషన్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ ప్రకారం ఖమ్మంలో సెయిల్‌‌‌‌ ద్వారా ఇంటిగ్రేటెడ్‌‌‌‌ స్టీల్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటునందించాలని సీతారామన్​కు రాసిన లేఖలో కేటీఆర్​ కోరారు.