సిరిసిల్ల రాజేశ్వరి జీవితం అందరికీ ఆదర్శం: కేటీఆర్

సిరిసిల్ల రాజేశ్వరి జీవితం అందరికీ ఆదర్శం: కేటీఆర్

సిరిసిల్ల రాజేశ్వరి మరణం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి, తన వైకల్యాలను జయించి ఆత్మవిశ్వాసంతో కాళ్లనే చేతులుగా మల్చుకొని, అక్షరాలు నేర్చుకుని కవితలు రాసిన తీరు అద్భుతమని  కేటీఆర్ అన్నారు. శరీరానికే వైకల్యం కానీ, ఆలోచనకి, ఆశయానికి కాదని, రాజేశ్వరి తన మనోధైర్యంతో నిరూపించిందన్నారు. ఆమె స్ఫూర్తివంతమైన జీవన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శమని రాజేశ్వరి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. 

సిరిసిల్ల రాజేశ్వరి గురించి.....

నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి జీవితాన్ని వైకల్యం చిన్నాభిన్నం చేసింది. ఎక్కడ చెదరని గుందేనిబ్బరం తో  కాళ్ల ను చేతులుగా మలచుకుని తన ఆత్మవిశ్వాసాన్ని అక్షరాలుగా నిలబెట్టి ఎన్నో కవితలు రాశారు. చెదరని ఆత్మవిశ్వాసంతో రాజేశ్వరి ఎన్నో కవితలు.రాశారు."సంకల్పం ముందు వైకల్యం ఎంత! ధృడ చిత్తం ముందు దురదృష్టం ఎంత! ఎదురీత ముందు విధిరాత ఎంత. పోరాటం ముందు ఆరాటం ఎంత.రాజేశ్వరి రాసిన కవిత ను గమనిస్తే ఆమె అక్షరాల  పదును అర్థమవుతుంది. రాజేశ్వరి రాసిన కవితలను సుద్దాల ఫౌండేషన్ సిరిసిల్ల రాజేశ్వరి కవితలు పేరుతో కవిత సంకలనాన్ని తీసుకొచ్చిన  విషయం తెలిసిందే. 2014 లో  వచ్చిన ఈ కవిత సంకలనానికి జీవితమే కవిత్వం అంటూ ముందుమాట రాస్తూ డాక్టర్ శీలాలోలిత చివర్లో చెప్పిన మాటలు "బతుకుతున్నాం బాధపడుతున్నం అంతవరకే  కానీ అమె మాత్రం జీవిస్తుంది అనుభవిస్తుంది. అనుభవాల  నుంచి వచ్చింది రాజేశ్వరి కవిత్వం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రాజేశ్వరి చివరకు తుదిశ్వాస విడిచారు.  సిరిసిల్ల ప్రాంతం నుంచి వైకల్యాన్ని సైతం ధిక్కరించి ఆత్మవిశ్వాసపు అక్షరాలను కవిత్వంలో ఆవిష్కరించిన సిరిసిల్ల రాజేశ్వరి ఇక లేరు. రాజేశ్వరికి వినమ్రంగా కన్నీటి నివాళులు.