ప్లాస్ట్ ఇండియా యాప్ ను లాంచ్ చేసిన కేటీఆర్

ప్లాస్ట్ ఇండియా యాప్ ను లాంచ్ చేసిన కేటీఆర్

తెలంగాణ బిజినెస్ ఫ్రెండ్లీ రాష్ట్రమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రానికి పెట్టుబడులను స్వాగతిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్లాస్ట్ ఇండియా 2023.. 11వ ప్లాస్టిక్ ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్ అండ్ కన్వెన్షన్ ఢిల్లీలో జరగనుంది. ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్ లో ప్లాస్ట్ ఇండియా 2023 ప్రమోషన్, రిజిస్ట్రేషన్, యాప్ ను మంత్రి కేటీఆర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్ట్ ఇండియా ప్రమోషన్స్ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇండియాలో 6వ లార్జెస్ట్ ఎకానమీ కలిగిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఎకానమీలో చైనాను మన దేశం ఎందుకు బీట్ చేయలేకపోతున్నామని ప్రశ్నించారు. ఇండియన్ ఎకానమీ పెంచేందుకు దేశంలో మార్పులు రావాలన్నారు. ఇండియాలో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

గుజరాత్ లో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఎన్నో ఏళ్ళ నుండి మొదలైంది. గుజరాతీలు మొదటి నుండి వ్యాపార స్వభావం ఉన్నవాళ్లు.. వారు ఎన్నో తరాలుగా పారిశ్రామిక వేత్తలుగా కొనసాగుతున్నారని కేటీఆర్ తెలిపారు. మిగతా రాష్ట్రాలు ఈ విషయంలో వారి నుండి ఎంతో నేర్చుకోవాలన్నారు. ఒకప్పుడు చైనా, ఇండియా జీడీపీ ఒక్కటే.. కానీ ఇప్పుడు మన జీడీపీ ఎక్కడుందో ప్రతి ఒక్కరు ఆలోచించాలని సూచించారు. మన ఎకానమీ 3 ట్రిలియన్లు ఉంటే.. చైనా ఎకానమీ 16 ట్రిలియన్లకు చేరిందన్నారు. ఇన్వెస్టర్లు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ పెట్టుబడులు పెట్టాలని చెప్పారు. ప్లాస్టిక్ బ్యాన్ చేయడం మంచిది.. కానీ ప్రజలకు ఆల్టర్ నేట్ చూపించాలి లేదంటే ఇది పేపర్ కే పరిమితమవుతుందన్నారు.

పెట్టుబడులను ప్రోత్సహిస్తున్న రాష్ట్రం తెలంగాణ.. ఇక్కడ ప్లాస్ట్ ఇండియా యూనిట్ ను ఏర్పాటు చేయండి అని కేటీఆర్ కోరారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ స్టేట్.. రాష్ట్రంలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేశాం, కానీ అల్టర్ నేటివ్ ను వెతకాలన్నారు. ప్లాస్టిక్ ను రోజురోజుకు చాలా వాడుతున్నాం. అయితే సస్టెయినబుల్, రీసైకిల్ ప్లాస్టిక్ ను ప్రోత్సహించాలిసిన అవసరం ఉందన్నారు. ఆదిశగా పరిశ్రమలు ప్లాస్టిక్ కు ఆల్టర్ నేట్ ఉత్పత్తుల ఇన్నోవేషన్ చేయాలి వివరించారు. ప్లాస్టిక్ ఉత్పత్తి, వినియోగం పైన ఫైన్ బ్యాలెన్స్ ఉండాలి. 2014లో ప్లాస్టిక్ యూనిట్స్ పది వేలు ఉంటే ఇపుడు 15 వేలకు పైగా చేరాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసితో ఇక్కడ పరిశ్రమలు పెరుగుతున్నాయన్నారు.

తెలంగాణకు పెట్టుబడులు వస్తే ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్ అన్నారు. రీసైకిల్ ప్లాస్టిక్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నమని తెలిపారు. మంచి ఐడియాలతో రండి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని కోరారు. తెలంగాణలో సస్టెయినబులిటీని ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ పై సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలని సూచించారు. పర్యావరణ హితమైన ఉత్పత్తుల ప్రోత్సహించడంలో గుజరాత్ ను తెలంగాణ కూడా సస్టెయినబులిటీని ఫాలో కావాలన్నారు..ఆదిశగా ప్రరిశ్రమలను నెలకొల్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.