పెట్టుబడులకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం

పెట్టుబడులకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం

కొత్త రాష్ట్రంలో ఇంకా సమస్యలున్నాయన్నారు మంత్రి కేటీఆర్. సీఐఐ వార్షిక సదస్సులో మాట్లాడిన కేటీఆర్.. ఏడేళ్లలో అనేక రంగాల్లో అభివృద్ధి సాధించామన్నారు. ఇంటింటికి మంచి నీళ్లందిస్తున్నామన్నారు.  వ్యవసాయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పెట్టుబడులకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉందన్నారు. నాలుగేళ్లలోనే కాళేశ్వరం పూర్తి చేశామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం అని అన్నారు. వరి పండించడంలో పంజాబ్ ను దాటేశామన్నారు.  దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ ఉందన్నారు. కరెంటు సమస్యలు తీర్చుకున్నామన్నారు. తెలంగాణ అగ్రికల్చర్ జీఎస్ జీడీపీ 21 శాతమన్నారు.   ప్రతి ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేల పెట్టుబడి సాయం ఇస్తున్నామన్నారు.

నాటి కమెడియన్... నేటి ఉక్రెయిన్ అధ్యక్షుడు

నవీన్ మృతదేహం తరలింపుపై రాని స్పష్టత