చంద్రబాబు.. జగన్​కు మంత్రి కేటీఆర్​ థ్యాంక్స్​

చంద్రబాబు.. జగన్​కు మంత్రి కేటీఆర్​ థ్యాంక్స్​

తెలంగాణ అభివృద్ధి ఏపీలో ఉన్న జగన్‌‌‌‌కు, చంద్రబాబు నాయుడికి అర్థమవుతున్నదని, కానీ ఇక్కడున్న ప్రతిపక్ష నేతలకు అర్థం కావటం లేదని కేటీఆర్​ కామెంట్​ చేశారు. ‘‘సొంత రాష్ట్రం ముందుకు పోతుంటే మెచ్చుకునే ఓపిక ప్రతిపక్షాలకు లేదు. ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 100 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేదని చంద్రబాబు అన్నరు. అదే చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనచ్చునని అన్నరు. 

ఈ వేదిక ద్వారా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఐ థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు.. ఇక్కడ మంచి జరిగిందని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు” అని ఆయన​ అన్నారు. ‘‘తెలంగాణలో శాంతి భద్రతలను జగన్​ మెచ్చుకున్నరు. దిశ సంఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరుకు.. ఏపీ శాసనసభలో ఆయన ‘ఐ సెల్యూట్​ కేసీఆర్’ అని అన్నరు. ఐ థ్యాంక్స్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి” అని పేర్కొన్నారు.