మంత్రి కేటీఆర్ సెటైరికల్‌ ట్వీట్‌

మంత్రి కేటీఆర్ సెటైరికల్‌ ట్వీట్‌

గ్యాస్ సిలిండర్ ధర  పెంపు పై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  " మంచి రోజులు వచ్చేశాయ్‌.. అందరికీ శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్‌ సిలిండర్‌ ధరను కేంద్రం మరో రూ.50 పెంచేసింది. సిలిండర్‌ ధర పెంచి మహిళలకు ప్రధాని మోడీ  కానుకగా ఇచ్చేశారు" అని కేటీఆర్  సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర 50కి పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో రూ.1055గా ఉన్న గ్యాస్‌ సిలిండర్ ధర రూ.1105కు చేరింది. ఢిల్లీలో రూ. 1053గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబాయిలో రూ. 1002.50 నుంచి రూ. 1052.50, కోల్ కతాలో రూ. 1,029 నుంచి రూ.1,079కి చేరింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.