ర్యాంకుల్లో ముందున్నా.. ఏం చేయడం లేదంటారా?

ర్యాంకుల్లో ముందున్నా..  ఏం చేయడం లేదంటారా?

ప్రతిపక్షాలపై మరోసారి  మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంటుంటే.. ప్రతిపక్షాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

‘  స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. స్వచ్ఛ్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ మున్సిపాలిటీలు 16 అవార్డులను గెలుచుకున్నాయి.  కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనేక అవార్డుల జాబితాలోనూ తెలంగాణ టాప్ లో ఉంది. కానీ విపక్షాలు మాత్రం తెలంగాణ సర్కారు ఏమీ చేయడం లేదని అంటున్నాయి. ఇదేం దిక్కుమాలిన లాజిక్ అని  ఆశ్చర్యమేస్తోంది’ అని కేటీఆర్  కామెంట్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.