
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 17న ‘వరంగల్ తూర్పు’ పర్యటన నేపథ్యంలో నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, వాల్ పోస్టర్లు విచ్చలవిడిగా వెలిశాయి. ఇందులో భాగంగా పోచమ్మ మైదాన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రోడ్డుకు అడ్డంగా, ప్రయాణికులకు ఇబ్బందిగా మారాయి.
నిత్యం వేలాది మంది ప్రయాణించే రోడ్డుపై ఫ్లెక్సీల ఏర్పాటుతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎంహెచ్వో రాజేశ్‌ను వివరణ కోరగా.. ఫ్లెక్సీలు తొలగిస్తామని, రూల్స్ పాటించని వారికి ఫైన్లు వేస్తామన్నారు. - వరంగల్ సిటీ, వెలుగు