కేటీఆర్ దావోస్ ప‌ర్యట‌న విజయవంతం

కేటీఆర్ దావోస్ ప‌ర్యట‌న విజయవంతం

మంత్రి కేటీఆర్ దావోస్ ప‌ర్యట‌న ముగిసింది. పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా జ‌రిగిన 2023 ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సు ప‌ర్య‌ట‌న విజ‌య‌వంత‌మైంద‌ని కేటీఆర్ ట్వీట్‌ చేశారు. ఈ టూర్ లో రాష్ట్రానికి రూ.21 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేటీఆర్ ప్రకటించారు. 4 రోజుల పర్యటనలో 52 బిజినెస్, 6 రౌండ్ టేబుల్ స‌మావేశాలు, 2 ప్యానెల్ మీటింగ్ లో పాల్గొన్నట్లు చెప్పారు. రేపు తన బృందంతో కేటీఆర్ హైదరాబాద్ చేరుకోనున్నారు.  

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్ లో మరో రూ.16,000 కోట్ల పెట్టుబడితో మరో 3 డాటా సెంటర్లను ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని గతేడాదే ప్రకటించిన ఆ సంస్థ.. తాజాగా మరో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తామంది. దీంతో మొత్తంగా 6 డాటా సెంటర్లు హైదరాబాద్‌లో ఏర్పాటు కానుండటంపై మైక్రోసాఫ్ట్‌ కంపెనీకి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.