రాచకొండ కమిషనరేట్లో లక్ష సీసీ కెమెరాలు ఉన్నయ్ : మల్లారెడ్డి

రాచకొండ కమిషనరేట్లో లక్ష సీసీ కెమెరాలు ఉన్నయ్ : మల్లారెడ్డి

రాచకొండ కమిషనరేట్ పరిధిలో సుమారు లక్షకు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఇంకా పలు కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కాలనీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీపీ మహేష్ భగవత్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. 

అహ్మద్ గూడ, రాంపల్లి, నాగారం ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ కెమెరాలు బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కి కనెక్టై ఉంటాయని చెప్పారు. సీసీ కెమెరాలను నిరంతరం మానిటర్ చేస్తామన్నారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో 500సీసీ కెమెరాలు, నేను సైతం ద్వారా 4200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.