డీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి మల్లారెడ్డి

డీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి మల్లారెడ్డి

కూకట్ పల్లి, వెలుగు: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కూకట్ పల్లిలోని అశోకా వన్ మాల్ వద్ద మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రి ఆధ్వర్యంలో శనివారం 5కే వాకథాన్​నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. ఆరోగ్యం అంటేనే మల్లారెడ్డి అని.. 70 ఏండ్లు వచ్చినా ఇప్పటికీ హెల్దీగా, స్మార్ట్​గా ఉన్నానన్నారు. 

ఉదయం లేవగానే యోగా, సాయంత్రం జిమ్ చేస్తానని తెలిపారు. యువత డ్రగ్స్, గంజాయి, పొగాకుకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు. హార్ట్ ఎటాక్​లను నివారించాంటే ఎక్సర్ సైజ్ చేయాలన్నారు. అనంతరం డీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి వాకథాన్ లో పాల్గొన్న వారిని ఉత్సాహపరిచారు.