
మేడ్చల్ జిల్లా కీసరగుట్ట మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మహా గణపతి పూజతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిపింది. మంత్రి మల్లారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐదు రోజుల పాటు బ్రహోత్సవాలు జరగనుండగా.. జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు రూ. కోటి నిధులు ఇచ్చిన సీఎం కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు చెప్పారు.
యాదగిరిగుట్ట తరహాలోనే కీసరలోనూ ఫోన్ పే ద్వారా హుండీలో కానుకలు వేసే పద్దతి తీసుకువచ్చామని మల్లారెడ్డి చెప్పారు. దర్శనానికి ప్రత్యేక పాస్లు లేవని చెప్పారు. కానీ కొందరికి మాత్రం వీఐపీ పాస్ ద్వారా నలుగురు దర్శనానికి వెళ్లే విధంగా జిల్లా యంత్రాంగం పాస్లు జారీ చేసింది. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.బ్రహ్మోత్సవాలు మొదలైన అనంతరం వాలీబాల్ క్రీడలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.