అమరావతి భూసేకరణకు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్.. 18 వందల ఎకరాల సేకరణకు ఏపీ సర్కార్ ప్లాన్..

అమరావతి భూసేకరణకు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్.. 18 వందల ఎకరాల సేకరణకు ఏపీ సర్కార్ ప్లాన్..

అమరావతి భూసేకరణ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ. రాజధాని అమరావతిలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వని రైతులకు మరోసారి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోందని.. రాజధాని ప్రాంతంలో భూసేకరణకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపిందని అన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం అమరావతిలో భూ సేకరణ కోసం ప్రభుత్వం నిర్ణయంచిందని అన్నారు నారాయణ.

ట్రంక్ రోడ్లు  ఏడాదిన్నర లో పూర్తి అవుతాయని.. ట్రంక్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి సుమారు 1800 ఎకరాలు భూమి అవసరం ఉందని అన్నారు నారాయణ. రైతులు భూ సమీకరణ కు అంగీకరిస్తే మంచిదని.. లేకపోతే భూ సేకరణ చేపట్టాలని సీఆర్డీఏ ఆధార్టీ ప్రతిపాదించిందని స్పష్టం చేసారు.వచ్చే మార్చి నాటికి 4వేల ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని.. వాటిలో మౌలిక సదుపాయాలు కల్పనకు ఆమోదం తెలిపామని అన్నారు నారాయణ.