పనిచేశాం.. ఆదరించండి : నిరంజన్ రెడ్డి

పనిచేశాం.. ఆదరించండి : నిరంజన్ రెడ్డి
  • వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి 

వనపర్తి, వెలుగు : వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి  పనిచేశానని, తనను ఆదరించాలని ఓటర్లను  వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి  కోరారు. గురువారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామానికి సాగునీళ్లు తెచ్చి, పంటలు పండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు.  చేసిన పనులను చూసి తనను ఓటు వేసి గెలిపించాలని  కోరారు.   వలస వెళ్లిన ప్రజలు తిరిగి ఊళ్లకు చేరి పిల్లాపాపలతో ఆనందంగా ఉన్నారన్నారు.

పైరవీకారులకు తావులేకుండా పాలన అందించామని, ఇవన్నీ గుర్తించి తనకు ఓటెయ్యాలని  కోరారు.  కాంగ్రెస్ కు ఓటేస్తే గతంలో ఉన్న గడ్డు పరిస్థితులు పునరావృతం అవుతాయని హెచ్చరించారు.  వనపర్తిలో జరిగిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు ఉందన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ సౌమ్య నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణయ్య,  లక్ష్మారెడ్డి, రంగారెడ్డి, పురుషోత్తం, విక్రమ్, సర్పంచులు మణెమ్మ, శ్రీలత, నిర్మల, కృష్ణవేణి, గోపాల్ నాయక్, శాంత సైయులు, శాంతి ఇందిరా, ఉమ, అరుణ, మధు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.