కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతోనే వరి సాగు వద్దన్నాం

కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతోనే వరి సాగు వద్దన్నాం

రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతోనే వరి సాగు వద్దన్నామన్నారు. రైతులు ఏ పంట వేసుకుంటారనేది వాళ్లిష్టమని... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు వరి సమస్యపై సోనియాతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి.  రైతులు రోడ్లపై పడటానికి కేంద్రమే కారణమన్నారు. దేశంలో 8 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పారు. బీజేపీ నేతలు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు నిరంజన్ రెడ్డి.