రైతులకు సబ్సిడీతో ఆయిల్ ఫామ్ మొక్కలు

రైతులకు సబ్సిడీతో ఆయిల్ ఫామ్ మొక్కలు

11 వేల మందికి పైగా రైతులను ఆయిల్ పామ్ తోటల సందర్శనకు తీసుకెళ్లామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రతి నెల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఆయిల్ పామ్ తోటల్లో మూడు సంవత్సరాల వరకు అంతర్ పంటలు వేసుకోవచ్చన్నారు. నాలుగో సంవత్సరం నుంచి పంట వస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ వేసేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తున్నామన్నారు. 1100 ఎకరాల్లో నర్సరీలను ప్రోత్సహిస్తున్నామన్నారు. నర్సరీలల్లో రెండు లక్షల ఎకరాలకు సరిపడా మొక్కలు ఉన్నాయన్నారు. డ్రిప్ల పై పెరిగిన ధరలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఆయిల్ ఫామ్ మొక్కలను సబ్సిడీతో  నేరుగా రైతులకు అందిస్తామన్నారు. పంట మార్పిడికి రైతులకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రైతు వేదికలలో రైతులకు శిక్షణ అందిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తే జాబ్స్‌‌ నుంచి తీసేస్తరా?

గోవులను తీసుకెళ్లేందుకు అంబులెన్స్​