బీఆర్ఎస్తోనే రాష్ట్రాభివృద్ధి : నిరంజన్ రెడ్డి

బీఆర్ఎస్తోనే రాష్ట్రాభివృద్ధి : నిరంజన్ రెడ్డి

వనపర్తి, వెలుగు: 60 ఏండ్లు పాలించిన పార్టీలన్నీ తెలంగాణను ముంచినవేనని, కాంగ్రెస్ కు ఓటేస్తే మన కన్ను మనం పొడుచుకున్నట్లు అవుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో రెండు తరాల ప్రజలు మంచి భవిష్యత్  కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా కేంద్రంలోని రామకృష్ణేశ్వరస్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి, వాసంతి దంపతులు రుద్ర సహిత చండి హోమం నిర్వహించారు. మున్సిపల్​ వైస్ చైర్మన్  వాకిటి శ్రీధర్, పట్టణ ఇన్​చార్జి అరుణ్ ప్రకాశ్, రాష్ట్ర మార్క్ ఫెడ్  డైరెక్టర్  విజయ్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, కౌన్సిలర్లు నాగన్న యాదవ్, ఆవుల రమేశ్, తిరుమల్, గోపాల్, శ్రీనివాస్ గౌడ్, కుమార్  పాల్గొన్నారు.