నిరుపేదలకు రూ.1,070 కోట్ల సాయం అందించాం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నిరుపేదలకు రూ.1,070 కోట్ల సాయం అందించాం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి, వెలుగు: రాష్ట్రంలోని నిరుపేదలకు వైద్య సహాయం కోసం సీఎంఆర్​ఎఫ్​ కింద ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రూ.1,070 కోట్ల ఆర్థికసహాయం అందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం కూసుమంచి క్యాంపు ఆఫీస్​లో 71 మంది లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్​ కింద రూ.23.33లక్షలు, 35 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు.

 కూసుమంచి మండలం ముత్యాలగూడెం గ్రామానికి చెందిన తాటికొండ రామారావు ఇటీవల కరెంటు షాక్​తో చనిపోగా విద్యుత్​ శాఖ నుంచి ఎక్స్​గ్రేషియా చెక్కును మృతుడి తండ్రికి అందజేశారు.