మే 10న  రేగొండ మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

మే 10న  రేగొండ మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

రేగొండ, వెలుగు: మండలంలో ఈ నెల10న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. బుధవారం రేగొండ మండల కేంద్రంతో పాటు, భాగిర్థిపేట రెవెన్యూ సదస్సులో సత్యనారాయణరావు పాల్గొని భూ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్​ ప్రభుత్వం ధరణి  పోర్టల్​తో భూములను మాయం చేసిందన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి రద్దు చేసి భూభారతితో అర్హులైన రైతులకు భూములపై హక్కులు కల్పిస్తున్నట్లుగా తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో వెంకటేశ్వర్​రావు, భూపాలపల్లి ఏఎంసీ చైర్మన్​కిష్టయ్య, కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు నర్సయ్య, నాయకులు భిక్షపతి, సాంబయ్య, షబ్బీర్, భిక్షపతి పాల్గొన్నారు.