పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో..మంత్రి పొంగులేటి పర్యటన

పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో..మంత్రి పొంగులేటి పర్యటన

కూసుమంచి/నేలకొండపల్లి/ఖమ్మం రూరల్​/రఘనాథపాలెం : పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పర్యటించారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో నిర్వహించిన కందుల లక్ష్మయ్య కుమారుడి వివాహానికి, కూసుమంచిలోని ఎస్ఆర్ బ్రదర్స్ ఫంక్షన్ హాల్​లో పార్తబోయిన లక్ష్మయ్య కుమారుడి వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అనంతరం నేలకొండపల్లి మండలం అనాసాగరంలో తాటికొండ శ్రీనివాసరావు కుమారుడి అన్నప్రాసన వేడుకకు, ఖమ్మం రూరల్ మండలంలోని గుర్రాలపాడులో జరిగిన బుర్ర ఉపేందర్ కుమారుడి అన్నప్రాసన వేడుకలో పాల్గొన్నారు. రెడ్డిపల్లిలో టెంకటి శ్రీనివాసరావు కుమారుడి వివాహానికి, రఘునాథపాలెం మండలం పుటాని తండా గ్రామంలో జరిగిన మూడ్ బాలాజీ కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు. మంత్రి వెంట పలువురు కాంగ్రెస్​నేతలు ఉన్నారు.