దివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం : మంత్రి పొన్నం ప్రభాకర్

దివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం : మంత్రి పొన్నం ప్రభాకర్

బషీర్ బాగ్ , వెలుగు : దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు.  వికలాంగుల కోసం నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో కింగ్ కోఠిలోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌‌‌‌లో ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాల కోసం ఉచిత స్క్రీనింగ్, మేజర్మెంట్ క్యాంప్ ను మంత్రి ప్రారంభించారు.  అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ..  

ఉదయ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ సేవా సంస్థాన్..   దేశ వ్యాప్తంగా వికలాంగులకు కృతిమ అవయవాలను ఉచితంగా అందిస్తూ...  గొప్ప సేవా చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.  1500  మంది దివ్యాంగులకు  అవయవాల కొలతలు తీసుకున్నామని, వారికి త్వరలో వాటిని అందిస్తామని సంస్థాన్ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సంస్థాన్  డైరెక్టర్,  ట్రస్టీ,  దేవేంద్ర చౌబిసా,  ఉత్తమ్‌‌‌‌ దమరాణి, హైదరాబాద్ శాఖ కో ఆర్డినేటర్ అల్కా చౌదరి తదితరులు పాల్గొన్నారు.