జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం : పొన్నం ప్రభాకర్ 

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం : పొన్నం ప్రభాకర్ 

కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తానని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఆదివారం సిటీలో మంత్రికి వర్కింగ్ జర్నలిస్టులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తానని వెల్లడించారు. ఇటీవల చింతకుంట, మల్కాపూరు గ్రామాల్లో జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల స్థలాలకు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోసీ ఇప్పిస్తానన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కొండ లక్ష్మణ్, అనిల్ కుమార్, తిరుపతి, వీడియో జర్నలిస్టులు ఎండీ శుకూర్, దాడి సంపత్ కుమార్, దండు సంపత్, సుధీర్, మహేందర్ పాల్గొన్నారు.

కార్పొరేటర్లతో మంత్రి భేటీ

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ డీసీసీ ఆఫీసులో కార్పొరేటర్లు, పార్టీ లీడర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు బల్దియాలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా మేయర్ సునీల్ రావు వ్యవహరిస్తున్నారని, మీరు ప్రజలపక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కార్పొరేటర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.