బీజేపీ నిజ స్వరూపంబయటపడింది: మంత్రి పొన్నం ప్రభాకర్

బీజేపీ నిజ స్వరూపంబయటపడింది: మంత్రి పొన్నం ప్రభాకర్
  • బీసీ బిల్లుకు మద్దతివ్వకుంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాల్సిందే: మంత్రి పొన్నం
  • బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని తేలిపోయింది: విప్ ఆది శ్రీనివాస్
  • బీసీ ద్రోహిగా బీజేపీ నిలిచిపోనుంది: విప్ బీర్ల అయిలయ్య
  • బీజేపీ బీసీ ద్రోహుల పార్టీ: జాజుల శ్రీనివాస్ గౌడ్
  • రాంచందర్‌‌రావు వ్యాఖ్యలను వాపస్‌ తీస్కోవాలని డిమాండ్‌
  • బీసీల రిజర్వేషన్లపై బీజేపీది డబుల్ గేమ్: బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు

హైదరాబాద్, వెలుగు: బీసీల 42 శాతం రిజర్వేషన్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు వ్యాఖ్యలు ఆ పార్టీ నిజ స్వరూపాన్ని బయటపెట్టాయని మంత్రి పొన్నం ప్రభాకర్​ ఫైర్​అయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమేనని, గతంలో పొరుగు రాష్ట్రం తమిళనాడులో జరిగిందని మంగళవారం మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీసీల 42శాతం రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్​చేర్చడంలో విఫలమైతే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

 రిజర్వేషన్లు ఎందుకు అమలు కావో తాము చూస్తామన్నారు. రాష్ట్రాల దగ్గర ప్రామాణికమైన సమాచారం, ఎంపిరికల్ డేటా ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్​ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అంశమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.  తెలంగాణలోని అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజస్వరూపాన్ని గమనించాలని కోరారు.   కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చాల్సిందేనని డిమాండ్​ చేశారు.  ‘‘మా సీఎం రెడ్డి,  ఉప ముఖ్యమంత్రి ఎస్సీ, పీసీసీ అధ్యక్షుడు బీసీ.  మా వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం”అనిపొన్నం హెచ్చరించారు.  సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని, సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు.