రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగిస్తున్నారు : మంత్రి పొన్నం

రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగిస్తున్నారు : మంత్రి పొన్నం

  పవిత్ర భారత దేశంలో రాజకీయాలను కూడ మార్కెటింగ్ చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భోగి సందర్భంగా వేములవాడ ఆలయంలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ ప్రజలకు బోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా పడాలి, రైతులు బాగుండాలని కోరుకున్నట్టు చెప్పారు. వేములవాడ ఆలయన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

 ఈ దేశంలో దేవుడిని కూడ రాజకీయాలకు వాడుకుంటున్నారని మంత్రి పొన్నం అన్నారు. హిందూ సంస్కృతి ఉన్న వారు దేశాన్నీ గౌరవిస్తారని తెలిపారు. - దేశం లో 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 12 ద్వాదశ లింగాలు, 18 జ్యోతి లింగాలు, నాలుగు వేదాలు, నలుగురు జగద్గురులు ఉన్నారని తెలిపారు.  వాళ్ళ చేతుల మీదుగా రామాలయం ప్రారంభం చేయాల్సి ఉండగా రాజకీయాల కోసం, ఎన్నికల కోసం దేవుడిని ఉపయోగిస్తున్నారని ఫైర్ అయ్యారు. 

ఇదే విషయం తాము ప్రశ్నిస్తే హిందువులకు వ్యతిరేఖమని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దేవుడు కొందరి వాడు కాదు అందరి వాడని తెలిపారు.- రాముడు, శివుడు హన్మంతుడు మాకు లేడా అంటే మా పై  రాజకీయం చేస్తున్నారని చెప్పారు. -- దేశంలో మీ ప్రతిష్ట దిగజారుతున్న మీరు ఇంకా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.