ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో ‘వింగ్స్ ఇండియా –2026’ కు హైదరాబాద్ వేదిక అయ్యింది. హైదరాబాద్ బేగంపేటలో జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న ఈ ఎయిర్ షోను పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన రామ్మోహన్ నాయుడు ఈ ఏడాది విమానయాన రంగానికి గొప్పగా ఉంటుందన్నారు. ఆసియాలోనే అతిపెద్ద సదస్సులలో ఇదొకటని చెప్పారు.
‘భారతీయ విమానయానం’ థీమ్ తో కేంద్ర పౌర విమానయాన శాఖ ఈ వేడుక నిర్వహిస్తోంది. డిజైన్ నుంచి విస్తరణ, తయారీ నుంచి నిర్వహణ, చేరిక నుంచి ఆవిష్కరణ, భద్రత నుంచి స్థిరత్వం వరకు ఈ కార్యక్రమం సాగనుంది. ఈ నాలుగు రోజుల వేడుకలో దేశంలో వేగంగా విస్తరిస్తున్న విమానయాన రంగం, ప్రపంచ వ్యాప్తంగా విజయాలు, తయారీ, సేవలు, ఆవిష్కరణ తదితర అంశాలను హైలెట్ చేయనుంది
►ALSO READ | బడ్జెట్ 2026: క్రిప్టో ఇన్వెస్టర్లకు శుభవార్త అందనుందా? 2022 నుంచి జరిగింది ఇదే..
అంతర్జాతీయ విమానరంగ దిగ్గజ సంస్థలు ఈ వింగ్స్ ఇండియా షోలో పాల్గొనున్నాయి. విమాన ఇంజిన్ తయారీదారులు, ఎంఆర్వోలు, విమానాశ్రయ డెవలపర్లు, ఓఈఎంలు, సాంకేతిక నిపుణులు, శిక్షణ సంస్థలు తరలివచ్చాయి. ఎయిర్ షో తో పాటు స్టాటిక్ ఎయిర్ క్రాప్ట్ డిస్ ప్లే, ఫ్లయింగ్, ఏరో బాటిక్ షోలు, సీఈఓ రౌండ్ టేబుల్ మీటింగ్స్, బీ2 బీ, బీ2 జీ సమావేశాలు జరగనున్నాయి. ఏవియేషన్ జాబ్ ఫెయిర్, అవార్డుల ప్రదానం, సాంస్కృతిక నృత్యాలు నిర్వహించనున్నారు.
