ఈ క్యాంపస్ తెలంగాణ కే స్ఫూర్తిగా నిలుస్తుంది : మంత్రి  సబితారెడ్డి 

 ఈ క్యాంపస్ తెలంగాణ కే స్ఫూర్తిగా నిలుస్తుంది : మంత్రి  సబితారెడ్డి 

ఉద్యమ సమయంలో సీఎం కేసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి  సబితారెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా కేజీ టూ పీజీ క్యాంపస్ ను కేటీఆర్ తో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం మంత్రి సబితారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ రంగంలో దేశంలో ఎక్కడా కూడా గంభీరావుపేట లాంటి క్యాంపస్ ఉండదన్నారు. ఈ క్యాంపస్ తెలంగాణ కే స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 12 కాంపోనెంట్ లతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరిగిందన్నారు.

మన ఊరు మనబడి కార్యక్రమం కింద 7,300 కోట్లతో 26  వేల స్కూల్ లను 3 విడతలలో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సబితారెడ్డి వెల్లడించారు. తొలి విడతలో రూ.3,509 కోట్లతో 9 వేల స్కూలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మంత్రి కేటీఆర్ మార్గదర్శంతో పాఠశాలల్లో డైనింగ్ హాల్ ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసిఆర్ దిశా నిర్దేశంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నామని చెప్పారు. 5 వేల మంది విద్యార్థులు విదేశాలలో చదివేందుకు ఆర్థిక సహకారం చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని వ్యాఖ్యానించారు. సీఎం కేసిఆర్ సారథ్యంలో గంభీరావుపేట కేజీ టూ పీజీ క్యాంపస్ మాదిరిగా రాష్ట్రంలో మరిన్ని క్యాంపస్ లు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.