మహిళలకు సఖీ సెంటర్ అమ్మలాంటిది:మంత్రి సబితా 

మహిళలకు సఖీ సెంటర్ అమ్మలాంటిది:మంత్రి సబితా 

ఆపదలో ఉన్న మహిళలకు సఖీ సెంటర్ అమ్మలాంటిదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహిళల రక్షణ కోసమే ఈ సఖీ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ మహిళల భద్రత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి సెంటర్లు నగరంలో ఏర్పాడు చేయడం గర్వకారణంగా ఉందన్నారు.  మహిళల కోసం 181హెల్ప్ లైన్ సెంటర్ ను సంప్రదించాలని సూచించారు. సఖీ సెంటర్లు చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. వనస్థలిపురం లోని ఏరియా హాస్పిటల్ లో సఖీ వన్  స్టాఫ్ సెంటర్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రారంభించారు.

మహిళల రక్షణ కోసం సఖీ సెంటర్ ను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ వ్యాప్తంగా మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 181 హెల్ప్ లైన్ నెంబర్ ,సఖి సెంటర్ ఆపన్నాహాస్తం లాంటిదన్నారు.