విద్యార్థులకు ప్రపంచస్థాయి శిక్షణ : మంత్రి సబితారెడ్డి

విద్యార్థులకు ప్రపంచస్థాయి శిక్షణ : మంత్రి సబితారెడ్డి

విద్యార్థులు ప్రపంచస్థాయిలో రాణించే విధంగా ప్రభుత్వం శిక్షణ ఇస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మహిళల  విద్యా, ఆర్థిక సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ కింగ్ కోఠి లోని భారతీయ విద్యాభవన్ లో మాలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కాలర్ షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాలబర్ సంస్థ విద్యార్థినుల చదువు కోసం కోటి అరవై లక్షలు స్కాలర్ షిప్ అందించడం అభినందనీయమని మంత్రి సబిత అన్నారు. గతంలో బాలికల చదువు పట్ల తల్లిదండ్రులు విముఖత చూపేవారని.. కానీ నేటి సమాజంలో బాలురులతో సమానంగా వారు కూడా రాణిస్తున్నారని అన్నారు. స్కాలర్ షిప్ పొందిన ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు పూర్తి చేసి తోటి వారికి సాయం అందించే స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.