ఎస్టీలకు కాంగ్రెస్, బీజేపీ ద్రోహం చేసినయ్ : మంత్రి సత్యవతి రాథోడ్

ఎస్టీలకు కాంగ్రెస్, బీజేపీ ద్రోహం చేసినయ్ :  మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎస్టీలకు ద్రోహం చేశాయని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. సోమ వారం ఆమె తెలంగాణ భవన్​లో మాజీ ఎంపీ ప్రొఫెసర్​ సీతారాం నాయక్​తో కలిసి మీడియాతో మాట్లాడారు.  కేసీఆర్ ఎస్టీలకు అండగా నిలిచారని.. తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలు చేశారని, 6 శాతమున్న రిజర్వే షన్లను 10 శాతానికి పెంచారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు ఆచ రణ సాధ్యం కాని హామీలతో ఓట్లు పొందాలని చూస్తున్నాయని విమ ర్శించారు. విభజన చట్టంలోని ట్రైబల్​ వర్సిటీ హామీపై కేంద్రం నోరు మెదప లేదని, ఎన్నికలు వస్తున్నాయని వర్సిటీ పేరుతో హడావుడి చేస్తున్నదన్నారు. 11న శామీర్​పేటలో నిర్వహించే గిరిజనుల ఆత్మగౌరవ సభను సక్సెస్​ చేయాలన్నారు.