బీఆర్ఎస్ పాలనలో ఐటీడీఏలు నిర్వీర్యం : మంత్రి సీతక్క

బీఆర్ఎస్ పాలనలో ఐటీడీఏలు నిర్వీర్యం : మంత్రి సీతక్క

హనుమకొండ: గత పాలనలో ఐటీడీఏలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయన్నారు మంత్రి సీతక్క.. హనుమకొండలోని గోపాలపూర్ లో ఆదివాసీ ఆత్మీయ సమ్మేళనసభలో పాల్గొన్నారు సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఆదివాసీ బిడ్డగా గర్విస్తున్నా.. ఆదివాసీ బిడ్డ మంత్రి అవడం తెలుగురాష్ట్రాల్లో ఇదే ప్రథమం అన్నారు సీతక్క. సమ్మక్క , సారక్క ఆశీస్సులతో మంత్రిని అయ్యాను.. మీ బిడ్డగా మీకు అండగా ఉంటానన్నారు మంత్రి సీతక్క. 

ALSO READ :- ఇద్దరు పిల్లలు మృతి పరారీలో తల్లిదండ్రులు

ఆదివాసీల న్యాయమైన డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరిస్తారన్నారు. గిరిజన సంక్షేమ శాఖ కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రే చూస్తున్నారు.. గిరిజనుల సమస్యలను తప్పకుండా పరిష్కారం లభిస్తుందన్నారు. ఏటూరు నాగారంలో బస్ డిపో, ములుగులో ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి సీతక్క.