దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి: మంత్రి సీతక్క

దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి: మంత్రి సీతక్క

నరేంద్ర మోదీ పాలనలో బట్టలు, బంగారం అన్ని ధరలు పెరిగిపోయాయని మండిపడ్డారు మంత్రి సీతక్క.  దేశ సంపదను మోదీ.. అంబానీ, అదానీలకు పంచిపెట్టారన్నారు. ఇంకా దోచుకోవాడానికి మూడోసారి గెలిపించమంటున్నారని మోదీపై ఫైర్ అయ్యారు మంత్రి. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం సాయంత్రం హన్మకొండ జిల్లా మడికొండలో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..  ప్రజాస్వామ్యం బతకాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు.

Also Read:కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం అయితడు .. ఆ అర్హత ఆయనకుంది

మంత్రి సీతక్క పాయింట్స్:

  • కాంగ్రెస్ అంటేనే గ్యారంటీ.. చెబితే చూసిచూపెడుతుంది.
  • పేదలను ఆత్మగౌరవంతో బతికేలా చేసింది కాంగ్రెస్ .
  • రాజ్యాంగం మార్చేందుకు మోదీ 400 సీట్లు అడుగుతున్నారు.
  •  పేదలకు మోదీ ఒక్క ఇళ్లైనా కట్టించారా?
  • మోదీ పాలనలో పుడితే పన్ను... చస్తే పన్ను
  • 100 రోజుల పనని మోదీ 42 రోజులకు తగ్గించారు
  • దేశంలో కాంగ్రెస్ రాబోతుందని మోదీకి భయం పట్టుకుంది
  • గాంధీ కుటుంబం ఏ పదవిలో లేకున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది
  • ఆరు గ్యారంటీలను పేదోళ్లను కాంగ్రెస్ కడుపులో పెట్టుకుంది