- ఏర్పాట్లను పరిశీలించిన వాకిటి శ్రీహరి
మక్తల్, వెలుగు : మక్తల్ నియోజకవర్గంలో గురువారం రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం పరిశీలించి అధికారులతో సమీక్షించారు. రూ. 173.83 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొననుండగా, కాచ్వార్ టోల్గేట్ వద్ద స్వాగతం పలుకనున్నారు.
ఈ పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఇదే క్రమంలో మక్తల్ నుంచి వనపర్తికి వయా కురుమూర్తి మీదుగా వెళ్లే కొత్త బస్సు సర్వీసును మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఇది విద్యార్థులకు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. అనంతరం ఊట్కూర్ మండలం చిన్నపొర్ల జెడ్పీ హైస్కూల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన తీరును పరిశీలించారు.
