
- పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క
ఆదిలాబాద్ టౌన్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పార్టీ శ్రేణులకు సూచించారు. మహారాష్ర్టలోని వార్దాలో గల సేవాగ్రామ్ సందర్శనకు వెళ్తూ శనివారం ఆదిలాబాద్ కు వచ్చిన ఆమె నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రిని పార్టీ నాయకులు సన్మానం చేశారు.
అనంతరం మంత్రికి పోలీసుల గౌరవ వందనం చేశారు. జిల్లా రాజకీయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గురించి చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు తదితర విషయాలపై సమీక్షించారు. మంత్రి వెంట సేవాగ్రామ్‌కు కంది శ్రీనివాసరెడ్డి, జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, డీఎస్పీ జీవన్ రెడ్డి, నాయకులు లోక ప్రవీణ్‌రెడ్డి, గిమ్మ సంతోశ్, రావుల సోమన్న యాదవ్ తదితరులు ఉన్నారు.