హైదరాబాద్, వెలుగు: ప్రకృతి విలయానికి అతలాకూతలమైన కేరళలోని వయనాడ్ లో మంత్రి సీతక్క పర్యటించారు. శనివారం ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తో కలిసి ప్రభావిత ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారి సహాయార్థం తాను సేకరించిన రూ.20 లక్షల చెక్ ను స్థానిక ఎమ్మెల్యే టి.సిద్దికి మంత్రి అందించారు.
దాదాపు రూ.10 లక్షల విలువైన దుస్తులు, నిత్యావసర సరకులను స్థానిక నాయకులకు అందజేశారు. స్థానిక శ్మశాన వాటికలో మృతులకు మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. విపత్తుతో నష్టపోయిన వారి జీవితాలను పునర్నిర్మించడంలో..సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందిస్తామని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు.