జల్ జీవన్ మిషన్ కు నిధులుఇవ్వండి: మంత్రి సీతక్క 

జల్ జీవన్ మిషన్ కు నిధులుఇవ్వండి: మంత్రి సీతక్క 

న్యూఢిల్లీ:తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీరు అందించేందుకు నిధులు కేటాయించాలని రాష్ట్ర మంత్రి సీతక్క కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రఘునాథ్ పాటిల్ ను కోరారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 56.98 లక్షల గృహాలకు రక్షిత మంచినీరు అందుతుందని కేంద్ర మంత్రికి  సీతక్క రిపోర్టు ఇచ్చారు. కొత్త గా ఏర్పాటు గ్రామాలు, కొత్తగా నిర్మించిన ఇండ్లకు నల్లాల ద్వారా మంచినీటి సరఫరాకు నిధులు సాంక్షన్ చేయాలని మంత్రి సీతక్క కోరారు. 

సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లికి వెళ్లినవారిలో సీతక్క కూడా ఉన్నారు.  ఈక్రమంలో పలువురు కేంద్ర మంత్రులను తెలంగాణ రాష్ట్ర మంత్రి సీత క్క కలిశారు. మొదట పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను కలిశారు.  తెలంగాణలోని గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని మంత్రి సీతక్క కోరా రు. తాత్కాలిక భవనాల్లో గ్రామ పంచాయతీలు తమ విధులను నిర్వహిస్తున్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ స్కీం కింద పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు  కేటాయించాలని  మంత్రి సీతక్క  కోరారు.