
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్న హైదరాబాద్.. ఇప్పుడు ‘ఎమర్జింగ్ లీగల్ టెక్‌హబ్’గా ఎదుగుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. న్యాయవ్యవస్థలో అప్పటికీ.. ఇప్పటికీ అనేక మార్పులు వచ్చాయని, ప్రస్తుతం న్యాయవ్యవస్థలోనూ టెక్నాలజీ వినియోగం పెరిగిందన్నారు. ఏఐ ఆధారిత పరిశోధన, వర్చువల్ కోర్టు రూంలు, రియల్ టైం కేసు ట్రాకింగ్, ఈ– ఫైలింగ్ వంటివి అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.
శనివారం నోవాటెల్ హెచ్ఐసీసీలో ‘లెక్స్ విట్ నెస్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది గ్రాండ్ మాస్టర్ 2025 – హైదరాబాద్ ఎడిషన్’ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులు కేవలం కోర్టు అధికారులు మాత్రమే కాదని, సమానత్వాన్ని అందించే వాస్తు శిల్పులు, రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రసాదించిన హక్కులకు సంరక్షకులని కొనియాడారు.