
హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ హెల్త్‌కేర్ ఇంజనీరింగ్ సెంటర్ కోసం కొత్త ఆఫీసును ప్రావిడెన్స్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. చీఫ్‌గెస్టుగా వచ్చిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు దీనిని ప్రారంభించారు. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి హైదరాబాద్‌లోని తన ఆఫీసులో ఉద్యోగుల సంఖ్యను నాలుగు వేలకు పెంచుతామని ప్రకటించింది.
క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, క్లినికల్ అప్లికేషన్స్, డిజిటల్ సొల్యూషన్స్, డేటా అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ప్రాసెస్ ఆటోమేషన్, డిజిటల్ ఆపరేషన్స్, ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్, జెన్ఏఐ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీలతో సహా కీలకమైన ఫంక్షన్‌లకు సెంట్రల్ హబ్‌గా పనిచేయడానికి కొత్త సదుపాయాన్ని ప్రారంభించామని ప్రావిడెన్స్ పేర్కొంది.