జర్నలిస్టులు సమాజంలోని పీడిత ప్రజల గొంతుకలు : మంత్రి శ్రీనివాస్​ గౌడ్

జర్నలిస్టులు సమాజంలోని పీడిత ప్రజల గొంతుకలు : మంత్రి శ్రీనివాస్​ గౌడ్
  • టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర రెండో మహాసభలో మంత్రి శ్రీనివాస్​గౌడ్

హైదరాబాద్, వెలుగు: మీడియా ప్రతిపక్ష పాత్ర పోషించాలని మంత్రి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. జర్నలిస్టులు సమాజంలోని పీడిత ప్రజల గొంతుకలని అన్నారు. ఆదివారం ఆర్టీసీ కళాభవన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన తెలంగాణ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ జర్నలిస్ట్స్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ (టీడబ్ల్యూజేఎఫ్‌‌‌‌‌‌‌‌) రాష్ట్ర రెండో మహాసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారన్నారు. మండల, జిల్లా స్థాయిలో పనిచేసే జర్నలిస్టుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది చేస్తున్న బ్లాక్‌‌‌‌‌‌‌‌ మెయిలింగ్‌‌‌‌‌‌‌‌ విధానం జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌ సమాజానికే కీడు చేస్తోందన్నారు. 

కార్పొరేట్ శక్తుల చేతుల్లో మీడియా: తమ్మినేని

షోయబుల్లాఖాన్‌‌‌‌‌‌‌‌ వారసులు జర్నలిస్టులని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ శక్తుల చేతుల్లో పత్రికలు, చానళ్లు పనిచేస్తున్నాయని, దీంతో జర్నలిస్టులకు మరింత ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు. ప్రజలే కేంద్రంగా, వారి జీవితాలే కథాంశాలుగా వార్తలు రాయాలని ఆంధ్రజ్యోతి ఎడిటర్‌‌‌‌‌‌‌‌ కె. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ సూచించారు. ఈ సందర్భంగా 55 మందితో టీడబ్ల్యూజేఎఫ్‌‌‌‌‌‌‌‌ కొత్త కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సోమయ్య, బసవ పున్నయ్య,  కోశాధికారిగా వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.